Published on Dec 1, 2025
Current Affairs
రాడార్‌ గైడెన్స్‌తో తొలిసారిగా సాధించిన మానవరహిత వ్యవస్థ
రాడార్‌ గైడెన్స్‌తో తొలిసారిగా సాధించిన మానవరహిత వ్యవస్థ

ఇప్పటివరకూ మానవసహిత యుద్ధవిమానాలు రాడార్‌ మార్గనిర్దేశకత్వంలో మరో లక్ష్యాన్ని నేలకూల్చగా.. తొలిసారిగా ఒక డ్రోన్‌ ఈ సత్తాను చాటింది. తుర్కియేకు చెందిన మానవరహిత యుద్ధవిమానం కిజిలెల్మా ఈ ఘనతను సాధించింది. సినోప్‌ ఫైరింగ్‌ రేంజ్‌ వద్ద సాగర జలాలపై ఈ పరీక్ష జరిగింది.

ఇందులో కిజిలెల్మా డ్రోన్‌కు.. జెట్‌ ఇంజిన్‌తో నడిచే ఒక గగనతల లక్ష్యాన్ని నేలకూల్చే బాధ్యతను అప్పజెప్పారు. ఈ మానవరహిత యుద్ధవిమానంలో మురాద్‌ ఏఈఎస్‌ఏ రాడార్‌ ఉంది. ఇది చాలా దూరంలోని లక్ష్యాలను ఎప్పటికప్పుడు పరిశీలించగలదు. 

వేగంగా కదులుతున్న లక్షిత డ్రోన్‌ను.. ఎలాంటి సాయం లేకుండానే కిజిలెల్మాలోని రాడార్‌ గుర్తించింది.