Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 24, 2026
Current Affairs
‘రోడ్‌మ్యాప్‌ టు 100 గి.వా. హైడ్రో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్ట్స్‌ బై 2035-36’ నివేదిక
‘రోడ్‌మ్యాప్‌ టు 100 గి.వా. హైడ్రో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్ట్స్‌ బై 2035-36’ నివేదిక
  • కేంద్ర విద్యుత్తు శాఖ 2026, జనవరి 23న ‘రోడ్‌మ్యాప్‌ టు 100 గి.వా. హైడ్రో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్ట్స్‌ బై 2035-36’ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో మూడో స్థానంలో నిలిచింది. 56,335 మెగావాట్ల సామర్థ్యంతో మహారాష్ట్ర, 41,525 మెగావాట్ల సామర్థ్యంతో ఒడిశా, 32,750 మెగావాట్ల సామర్థ్యంతో ఏపీ మొదటి మూడు స్థానాల్లో నిలిచినట్లు పేర్కొంది.
  • ఈ విషయంలో ఏపీ దక్షిణాదిలో తొలి స్థానంలో ఉంది. ఏపీలో ఇప్పటికే 1,680 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. మరో 2,850 మెగావాట్ల ప్రాజెక్టులు నిర్మాణంలో 12,050 మెగావాట్ల ప్రాజెక్టులు సర్వే, డీపీఆర్‌ దశలో ఉన్నాయి.