Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 14, 2026
Government Jobs
రైట్స్‌ లిమిటెడ్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్‌ ఉద్యోగాలు
రైట్స్‌ లిమిటెడ్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్‌ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైట్స్ లిమిటెడ్ రెగ్యులర్‌ ప్రాతిపదికన డిప్యూటీ జనరల్‌ మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్ (లీగల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05

వివరాలు:

1. డిప్యూటీ జనరల్ మేనేజర్(లీగల్‌): 01

2. అసిస్టెంట్‌ మేనేజర్ (లీగల్‌): 04

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(లా)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు 41 ఏళ్లు, అసిస్టెంట్‌ మేనేజర్‌కు 32 ఏళ్లు.

వేతనం: నెలకు డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు రూ.70,000 - రూ.2,00,000, అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.40,000 - రూ.1,40,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనలర్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఈడబ్ల్యూఎస్‌, ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.300.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026, ఏప్రిల్ 27

Website: https://www.rites.com/Career