Published on Dec 25, 2025
Government Jobs
రైట్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
రైట్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన గురుగ్రామ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (రైట్స్‌) రెగ్యులర్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06

వివరాలు:

1. సీనియర్ మేనేజర్‌(పోర్ట్స్‌ అండ్ వాటర్‌వేస్‌): 01

2. మేనేజర్‌(పోర్ట్స్‌ అండ్ వాటర్‌ వేస్‌): 02

3. మేనేజర్(కోస్టల్ మోడలింగ్‌): 02

4. అసిస్టెంట్‌ మేనేజర్(పోర్ట్ ప్లానింగ్‌): 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 32 నుంచి 38 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు పోస్టులను అనుసరించి రూ.40,000 నుంచి రూ.1,80,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.300.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. 

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 27.

పరీక్ష తేదీ: 2026 ఫిబ్రవరి 22.

Website:https://www.rites.com/Career