Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Nov 27, 2025
Government Jobs
రైట్స్‌ లిమిటెడ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టులు
రైట్స్‌ లిమిటెడ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టులు

గురుగ్రామ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (రైట్స్‌).. నార్త్‌, ఈస్ట్‌, వెస్ట్‌, సౌత్ జోన్‌లలో వివిధ విభాగాల్లో  అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

అసిస్టెంట్ మేనేజర్‌: 400

విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, సిగ్నల్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌, మెకానికల్, మెటలర్జీ, కెమికల్‌, ఐటీ, ఫుడ్‌ టెక్నాలజీ, ఫార్మ, 

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(సివిల్, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్, ఐటీ, మెటలర్జీ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 40 ఏళ్లు ఉండాలి.  

జీతం: నెలకు రూ.42,478.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.300.

దరఖాస్తు ప్రారంభ తేదీ: నవంబర్ 26.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్ 25. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. 

రాత పరీక్ష తేదీ: 2026 జనవరి 11.

పరీక్ష కేంద్రాలు: దిల్లీ/గురుగ్రామ్‌, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, భువనేశ్వర్‌, హైదరాబాద్‌, బిలాయ్‌, చెన్నై, పట్నా, లఖ్‌నవూ.

Website:https://www.rites.com/Career