Published on Nov 14, 2025
Apprenticeship
రైట్స్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు
రైట్స్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు

గురుగ్రామ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (రైట్స్‌) 2025-26 సంవత్సరానికి వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 252

వివరాలు:

1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 146

2. డిప్లొమా అప్రెంటిస్‌: 49

3. ట్రేడ్‌ అప్రెంటిస్‌(ఐటీఐ): 57

విభాగాలు: సివిల్‌, అర్కిటెక్చర్‌, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్‌ టెలికమ్‌, మెకానికల్, కెమికల్‌, మెటలర్జీ, ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌లో ఉత్తీర్ణత ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.14,000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.12,000, ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌కు రూ.10,000.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్‌ ఆధారంగా.  

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 నవంబర్‌ 17.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 5.

Website:https://www.rites.com/Career