గురుగ్రామ్‌లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకానామిక్ సర్వీస్ (రైట్స్) కేరళలోని వివిధ ప్రాజెక్ట్ సైట్‌లలో ప్రాజెక్ట్ ఇంజినీర్, టీం లీడ్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 34
వివరాలు:
టీమ్ లీడర్ (సేఫ్టీ)- 01
టీమ్ లీడర్ (ఎంఈపీ)- 02
ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎంఈపీ)- 12
సేఫ్టీ ఇంజినీర్- 02
జూనియర్ ఇంజినీర్ (ఎంఈపీ)- 17
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు టీమ్ లీడర్‌కు రూ.70,000- రూ.2,00,000; ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.50,000-1,60,000; సేఫ్టీ ఇంజినీర్‌కు రూ.40,000-రూ.1,40,000; జూనియర్ ఇంజినీర్ రూ.25,504.
వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 55 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 21.04.2025 - 25.04.2025.
వేదిక: 1. రైట్స్ లిమిటెడ్, శిఖర్, ప్లాట్ నెం.1, సెక్టార్-29, ఐఎఫ్‌ఎఫ్‌సీఓ చౌక్ మెట్రో స్టేషన్ దగ్గర, గుడ్‌గావ్, హరియాణా.
2. రైట్స్ లిమిటెడ్, మొదటి అంతస్తు, హిల్టన్ హాస్పిటల్ ఎదురుగా తిరువనంతపురం.
Website:https://www.rites.com/