Published on Dec 3, 2024
Walkins
రైట్స్‌లో కన్సల్టెంట్‌ పోస్టులు
రైట్స్‌లో కన్సల్టెంట్‌ పోస్టులు

గుడ్‌గావ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకానామిక్‌ సర్వీస్‌ (రైట్స్)... ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో వ్యక్తిగత కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

వివరాలు:

1. టీమ్‌ లీడర్‌- 01

2. జియో టెక్నికల్‌/ మెటీరియర్‌ ఇంజినీర్‌- 01

3. క్వాలిటీ అస్యూరెన్స్‌ స్పెషలిస్ట్‌- 01

4. సోషల్‌ సేఫ్‌గార్డ్‌ స్పెషలిస్ట్‌- 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు టీమ్‌ లీడర్‌ పోస్టుకు రూ.2,50,000; మిగతా పోస్టులకు నెలకు రూ. రెండు లక్షలు. 

వయోపరిమితి: 63 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, పని అనుభవం, టెక్నికల్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 19-12-2024.

ఇంటర్వ్యూ తేదీలు: 18-12-2024 నుంచి 20-12-2024 వరకు

ఇంటర్వ్యూ ప్రదేశాలు: 

1. నెం. 10-3-150 &151/1, మొదటి అంతస్తు, మలాని ఎక్సెల్ సెయింట్‌ జాన్స్ రోడ్, రత్నదీప్ దగ్గర, సూపర్‌ మార్కెట్‌ ఈస్ట్‌ మరేడ్‌పల్లి, సికింద్రాబాద్‌.

2. CTS బిల్డింగ్, 2వ అంతస్తు, బీఎస్‌ఎన్‌ఎల్‌ కాంప్లెక్స్, నెం-16, గ్రీమ్స్ రోడ్, చెన్నై.

3. శిఖర్‌, ప్లాట్‌ నెం.01, సెక్టార్‌-29, గురుగ్రామ్‌. 

Website:https://www.rites.com/