Published on Nov 16, 2024
Walkins
రైట్స్‌లో అసిస్టెంట్‌ హైవే ఇంజినీర్‌ పోస్టులు
రైట్స్‌లో అసిస్టెంట్‌ హైవే ఇంజినీర్‌ పోస్టులు

గుడ్‌గావ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకానామిక్‌ సర్వీస్‌ (రైట్స్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 60

వివరాలు:

1. అసిస్టెంట్‌ హైవే ఇంజినీర్‌- 34
2. అసిస్టెంట్‌ బ్రిడ్జ్‌/ స్ట్రక్చరల్‌ ఇంజినీర్‌- 06
3. క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్‌- 20

అర్హత: పోస్టును అనుసరించి సివిల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, డిగ్రీ, పీజీ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 40 ఏళ్లు మించకూడదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 06-12-2024.

ఇంటర్వ్యూ తేదీలు: 02-12-2024 నుంచి 06-12-2024 

వేదిక: 
1. శిఖర్‌, ప్లాట్‌ 1, లీజర్‌ వ్యాలీ, రైట్స్‌ భవన్‌, సెక్టార్‌ 29, గుడ్‌గావ్‌, హరియాణా.
2. రైట్స్‌ లిమిటెడ్‌, ఎన్‌ఈడీఎఫ్‌ఐ హౌస్‌, నాలుగో అంతస్తు, గణేష్‌గురి, దిస్‌పూర్‌, గువాహటి, అసోం.
3. రైట్స్‌ ఒజాస్‌ భవన్‌, పన్నెండో అంతస్తు, బ్లాక్‌-డీజే/20, యాక్షన్‌ ఏరియా-1డీ న్యూ టౌన్‌, కోల్‌కతా.

Website:https://www.rites.com/