Published on Feb 4, 2025
Government Jobs
రైట్స్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు
రైట్స్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు

గురుగ్రామ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకానామిక్‌ సర్వీస్‌ (రైట్స్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 18 (యూఆర్‌- 09; ఈడబ్ల్యూఎస్‌-01; ఓబీసీ-04; ఎస్సీ-02; ఎస్టీ-02)

వివరాలు:

అసిస్టెంట్‌ మేనేజర్‌ (సివిల్‌)

అర్హత: సివిల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

జీతం: నెలకు రూ.40,000-రూ.1,40,000.

వయోపరిమితి: 32 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా. 

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.600; ఈడబ్ల్యూఎస్‌/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ వారికి రూ.300.

రాత పరీక్ష కేంద్రాలు: దిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌, గువాహటి, భువనేశ్వర్‌.

రాత పరీక్ష తేదీ: 09-03-2025.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 24-02-2025.

Website:https://www.rites.com/