సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ (సీయూఆర్‌జే) వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 07
వివరాలు:
1. ప్రొఫెసర్: 03
2. అసోసియేట్ ప్రొఫెసర్: 01
3. అసిస్టెంట్ ప్రొఫెసర్: 03
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,44,200 - రూ.2,18,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400 - 2,17,100, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.57,700 - రూ.1,82,400.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.750.
ఎంపిక ప్రక్రియ: సెమినార్, ప్రజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30 జూన్ 2025