Published on Jan 5, 2026
Current Affairs
రాజస్థాన్‌ పాఠశాలల్లో వార్తాపత్రికల పఠనం తప్పనిసరి
రాజస్థాన్‌ పాఠశాలల్లో వార్తాపత్రికల పఠనం తప్పనిసరి
  • విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంచడంతో పాటు పఠనాసక్తిని పెంపొందించేందుకు రాజస్థాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజూ వార్తాపత్రికలు చదవడాన్ని తప్పనిసరి చేసింది. విద్యార్థుల పదజాలం మెరుగుపరచడం, లోకజ్ఞానం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 
  • ఇటీవల ఉత్తర్‌ ప్రదేశ్‌లోనూ ఇటువంటి నిర్ణయాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.