శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 2024-25లో ప్రయాణికుల రాకపోకల్లో 15.20 శాతం వృద్ధి సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
మొత్తం 2.13 కోట్ల మంది ఈ విమానాశ్రయం నుంచి ప్రయాణించారు.
2024-25లో చివరి మూడు నెలలు (జనవరి నుంచి మార్చి వరకూ) దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకల్లోనూ శంషాబాద్ అరుదైన ఘనతను సాధించింది.
ఇక్కడి నుంచి నెలకు ప్రయాణించే వారి సంఖ్య గరిష్ఠంగా 20 లక్షలే కాగా.. ఈ మూడు నెలల్లో ఏకంగా 74 లక్షల మంది రాకపోకలు సాగించారు.
ఈ విషయంలో హైదరాబాద్.. జనాభాలో ముందున్న మెట్రో నగరాలు చెన్నై, కోల్‌కతాలను దాటేసింది.
అలాగే తన రోజువారీ గరిష్ఠ సగటు ప్రయాణికుల సంఖ్య 75 వేలను కూడా శంషాబాద్ జనవరి 18న అధిగమించింది. ఆ ఒక్కరోజే 94 వేల మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారికంగా వెల్లడించింది.