బ్యాంకులతో పాటు, ఇతర నియంత్రిత సంస్థల ఖాతాదారుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా ‘రిజర్వ్ బ్యాంక్-సమగ్ర అంబుడ్స్‌మన్ పథకం -2026’ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకురానుంది. ఇందుకోసం ‘రిజర్వ్ బ్యాంక్- అంబుడ్స్‌మన్ స్కీం 2025’కు కొన్ని సవరణలతో ముసాయిదాను 2026, జనవరి 16న విడుదల చేసి, ప్రజల అభిప్రాయాలు కోరింది.
బ్యాంకింగ్ సేవల్లో ఎదురయ్యే సమస్యలు, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత సమర్థంగా, వేగంగా మార్చేందుకు ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త పథకం 2026 జులై 1 నుంచి అమల్లోకి రానుంది. ఫిర్యాదిదారులకు తక్కువ ఖర్చుతో, వేగవంతమైన పరిష్కారాన్ని అందించడమే దీని ప్రధాన లక్ష్యమని ఆర్‌బీఐ పేర్కొంది.