బ్యాంకింగ్ వ్యవస్థలో స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 2025, మార్చిలో దశాబ్దాల కనిష్ఠమైన 2.3 శాతానికి చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నివేదిక వెల్లడించింది.
2024 సెప్టెంబరులో ఇవి 2.6 శాతంగా ఉన్నాయి.
2027 మార్చికి 46 బ్యాంకుల ఎన్‌పీఏలు మళ్లీ 2.6 శాతానికి చేరొచ్చని ఆర్‌బీఐ అర్ధ సంవత్సర ‘రిజర్వ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ’ నివేదికలో పేర్కొంది.
షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల రైటాఫ్‌లు, స్థూల ఎన్‌పీఏల మధ్య నిష్పత్తి 2023-24లో 29.5 శాతం నుంచి 2024-25లో 31.8 శాతానికి పెరిగింది.