Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 17, 2026
Government Jobs
రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో అసిస్టెంట్‌ పోస్టులు
రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో అసిస్టెంట్‌ పోస్టులు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కార్యాలయాలలో 'అసిస్టెంట్' పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 650

వివరాలు:

ముంబయి-249

చెన్నై- 53

కాన్పూర్ & లఖ్‌నవూ- 50

న్యూదిల్లీ- 49

గువాహటి- 36

భోపాల్- 30

కోల్‌కతా- 29

బెంగళూరు- 24

అహ్మదాబాద్- 20

చండీగఢ్- 20

భువనేశ్వర్- 18

నాగ్‌పూర్- 17

పట్నా- 17

జైపూర్- 11

హైదరాబాద్- 11

తిరువనంతపురం & కొచ్చి- 10

జమ్మూ- 06

అర్హతలు: అభ్యర్థి ఏదైనా విభాగంలో కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) పూర్తి చేసి ఉండాలి (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ) అభ్యర్థులకు కేవలం పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది). దీనితో పాటు కంప్యూటర్‌ (వర్డ్ ప్రాసెసింగ్) పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్థి ఏ రాష్ట్ర కార్యాలయానికి దరఖాస్తు చేస్తున్నారో ఆ రాష్ట్ర అధికారిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి.

వయోపరిమితి: 01.02.2026 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5ఏళ్లు; ఓబీసీలకు మూడేళ్లు వయసులో సడలింపు వర్తిస్తుంది.

ప్రారంభ వేతనం: నెలకు రూ.58,514(+అలవెన్సులు)

ఎంపిక విధానం: ప్రిలిమ్స్‌, మెయిన్‌, భాషా నైపుణ్య పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ప్రిలిమినరీ పరీక్ష: ఇంగ్లిష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్‌లో ఆబ్జెక్టివ్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.

మెయిన్స్‌: రీజనింగ్, ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ పై పరీక్ష ఉంటుంది.

భాషా నైపుణ్య పరీక్ష (LPT): మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సంబంధిత రాష్ట్ర అధికారిక భాషలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.50+ జీఎస్టీ (కేవలం ఇంటిమేషన్ ఛార్జీలు). జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.450+జీఎస్‌టీ (అప్లికేషన్ ఫీజు + ఇంటిమేషన్ ఛార్జీలు).

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కర్నూలు, కాకినాడ, రాజమహేంద్రవరం, నెల్లూరు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం.  

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 16.02.2026.

దరఖాస్తుకు చివరి తేదీ: 08.03.2026.

ప్రిలిమినరీ పరీక్ష (తాత్కాలిక): 11.04.2026.

మెయిన్ పరీక్ష (తాత్కాలిక): 07.06.2026.

Website:https://ibpsreg.ibps.in/rbiafeb26/