భారత రాజ్యాంగం ఆమోదం పొంది 2024, నవంబరు 26 నాటికి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం https: //constitution75.com పేరిట ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది.
అందులో రాజ్యాంగ పరిషత్ చర్చలు, నివేదికలు అందుబాటులో ఉంటాయని కేంద్ర సాంస్కృతిక శాఖ పేర్కొంది.
నవంబరు 26 నుంచి ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
అందులో భాగంగా నగరాలు, గ్రామాలు, పాఠశాలల్లో రాజ్యాంగ పీఠిక సామూహిక పఠన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.