రాజమండ్రి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 60
వివరాలు:
1. ఆఫీస్ సబార్డినేట్: 25
2. అనస్థీషియా టెక్నీషియన్: 02
3. కార్డియాలజీ టెక్నీషియన్: 03
4. ల్యాబ్ టెక్నీషియన్: 02
5. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్: 02
6. జనరల్ డ్యూటీ అటెండెంట్: 19
7. స్టోర్ అటెండెంట్: 03
8. ల్యాబ్ అటెండెంట్: 01
9. ఈసీజీ టెక్నీషియన్: 01
10. లైబ్రరీ అసిస్టెంట్: 01
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 42 ఏళ్లు.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.300, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఈఎస్‌ఎం, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.200.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 2026 జనవరి 9.
Website: https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/