ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు సాయంతో చేపట్టే వివిధ పనుల పురోగతిని ధ్రువీకరించేందుకు స్వతంత్ర పరిశీలన సంస్థగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కీ) వ్యవహరించనుంది.
ఈ మేరకు ఆస్కీ ఎంపికకు సంబంధించి సీఆర్‌డీఏ కమిషనర్ పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి కన్నబాబు జనవరి 17న ఉత్తర్వులు జారీ చేశారు.
రాజధాని నిర్మాణ పనులకు ఆర్థిక సాయమందించే రెండు బ్యాంకులూ నిర్దేశించిన డీఎల్‌ఐఎస్ మేరకు పనుల్లో పురోగతిని హైదరాబాద్‌కు చెందిన ఆస్కీ ధ్రువీకరించనుంది.