Notice: We've enabled a new exam system. If you face any issue during the exam, please contact your institute for support.

Published on Jul 12, 2025
Current Affairs
రాజధానికి ఆర్థిక సలహాదారుగా ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ
రాజధానికి ఆర్థిక సలహాదారుగా ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అభివృద్ధికి ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించేందుకు జాతీయ ఆర్థిక, మౌలిక వసతుల అభివృద్ధి బ్యాంకు (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ)తో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో 2025, జులై 11న ఒప్పందంపై బ్యాంక్‌ ఎండీ రాజ్‌కిరణ్‌రాయ్, సీఆర్‌డీఏ కమిషనర్‌ కన్నబాబు సంతకాలు చేశారు.