Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 23, 2026
Government Jobs
రాజేంద్రనగర్‌ ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో డైరెక్టర్‌ పోస్టులు
రాజేంద్రనగర్‌ ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో డైరెక్టర్‌ పోస్టులు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్ అండ్‌ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 09

వివరాలు:

వీడియో ఎడిటర్‌: 01

వీడియోగ్రాఫర్‌: 01

ట్రైనింగ్‌ మేనేజర్‌: 01

అకౌంట్స్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కో-ఆర్డినేటర్‌: 02

మల్టీ టాస్క్‌ అసిస్టెంట్: 02

అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

జీతం: నెలకు రూ.వీడియో ఎడిటర్‌కు రూ.50,000; వీడియోగ్రాఫర్‌కు రూ.55,000; ట్రైనింగ్‌ మేనేజర్‌కు రూ.45,000; అకౌంట్స్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కో-ఆర్డినేటర్‌కు రూ.40,000; మల్టీ టాస్క్‌ అసిస్టెంట్‌కు రూ.20,000.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష/ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: 08-03-2026.

Website: http://career.nirdpr.in/