ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో మహిళల స్కీట్‌లో రైజా థిల్లాన్ రజతం నెగ్గింది. 2025, మే 22న షల్ (జర్మనీ)లో జరిగిన 60 షాట్ల ఫైనల్లో ఆమె 51 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. ఫోబి స్కాట్ (బ్రిటన్, 53 పాయింట్లు) స్వర్ణాన్ని గెలవగా.. అనాబెల్ హెట్‌మెర్ (జర్మనీ, 38) కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.