ప్రముఖ కవయిత్రి రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్ (96) 2026, జనవరి 13న హైదరాబాద్ గోషామహల్ ప్రాంతంలోని జ్ఞాన్‌బాగ్ ప్యాలెస్‌లో కన్నుమూశారు. ఆమె దివంగత కవి గుంటూరు శేషేంద్రశర్మ భార్య. రాజకుమారి ఇందిరాదేవి చిత్రకారిణి, రచయిత్రి, కవయిత్రి. అల్లా ఇక్బాల్, గాలీబ్, అరబిందో రచనల నుంచి ప్రేరణ పొందిన ఇందిరాదేవి సాహిత్యం వైపు మళ్లారు.
1964లో ఆమె మొదటి కవితా సంపుటి ‘ది అపోసల్’ పేరుతో ప్రచురించారు. 1965, 1966లలోనూ ఆమె పుస్తకాలు ప్రచురితమయ్యాయి.
ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీకి మొదటి అధ్యక్షురాలిగా, ఉర్దూ అకాడమీ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు.