Published on Dec 19, 2025
Government Jobs
రంగరాయ మెడికల్ కాలేజీ కాకినాడలో ఉద్యోగాలు
రంగరాయ మెడికల్ కాలేజీ కాకినాడలో ఉద్యోగాలు

కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ (ఏపీ డీఎంఈ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 34

వివరాలు:

1. టెక్నీషియన్‌: 17

2. జనరల్ డ్యూటీ అటెండెంట్‌: 14

3. డ్రైవర్స్‌: 01

4. క్లీనర్స్‌: 01

5. కౌన్సిలర్స్‌: 01

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, డిప్లొమా, ఇంటర్‌, టెన్త్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 42 ఏళ్ల నుంచి 47 ఏళ్లు.

జీతం: నెలకు పోస్టులను అనుసరించి రూ.15,000 - రూ.32,670.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 27.

Website:https://rmckakinada.com/