రక్షణశాఖ కార్యదర్శిగా సీనియర్ బ్యూరోక్రాట్ రాజేశ్ కుమార్ సింగ్ 2024, నవంబరు 1న బాధ్యతలు చేపట్టారు. ఈయన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. రాజేశ్ కేంద్రంలో అనేక ముఖ్య పదవుల్లో విధులు నిర్వహించారు. 2023-2024 మధ్య వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగానికి కార్యదర్శిగానూ పనిచేశారు. దీనికి ముందు పశుసంవర్ధక, పాడి మంత్రిత్వశాఖకు కార్యదర్శిగా విధులు నిర్వహించారు.