2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ రూ.21,000 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. 2022-23తో పోల్చితే ఇది 32.5% అధికం.
మనదేశ రక్షణ ఎగుమతుల్లో దాదాపు 75% ప్రభుత్వ రంగ సంస్థల వాటా కాగా, మిగిలినవి ప్రైవేటు కంపెనీలు చేస్తున్నాయి. 2029కి రూ.50,000 కోట్ల విలువైన రక్షణ పరికరాలు ఎగుమతి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
మన దేశంలో దాదాపు 16 ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు, 430కి పైగా ప్రైవేటు రంగ కంపెనీలు, 16,000 ఎంఎస్‌ఎంఈలు (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు) రక్షణ ఉత్పత్తుల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
ఏం ఎగుమతి చేస్తున్నాం:
బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్స్, డోర్నియర్(డీఓ- 228) ఎయిర్ క్రాఫ్ట్, చేతక్ హెలికాప్టర్లు, ఇంటర్‌సెప్టర్ బోట్లు, తేలికపాటి టోర్పెడోలు, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్స్, ఆర్టిలరీ గన్స్, రాడార్లు, ఆకాశ్ మిస్సైల్స్, పినాకా రాకెట్స్, ఆర్మర్డ్ వాహనాలు, యుద్ధ విమానాల విడిభాగాలు అధికంగా ఎగుమతి అవుతున్నాయి.