Published on Mar 17, 2025
Current Affairs
రక్షణ రంగానికి విద్యుత్తు వాహనం
రక్షణ రంగానికి విద్యుత్తు వాహనం

బెంగళూరుకు చెందిన విద్యుత్‌ వాహన (ఈవీ) తయారీ అంకుర సంస్థ ప్రవేగ్‌ ఆవిష్కరించిన ఆల్‌-టెర్రెయిన్‌ స్టెల్త్‌ వాహనం ‘వీర్‌’కు ఐడీఈఎక్స్‌ పురస్కారం లభించింది.

వ్యూహాత్మక రక్షణ అవసరాల కోసం ప్రపంచంలోనే తొలి ఆపరేషనల్‌ ఈవీగా దీన్ని డిజైన్‌ చేశారు.

సైన్యం పరిశీలన కోసం వెళ్లిన ఈ వాహనం రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ప్రతిష్ఠాత్మక ఐడీఈఎక్స్‌ పురస్కారాన్ని అందుకుంది.

దేశ రక్షణ అవసరాల కోసం విద్యుత్తు వాహనాన్ని ప్రవేశ పెట్టడంలో, ఇది తొలి అడుగుగా భావిస్తున్నారు.