రోదసిలోని తమ ‘స్వేచ్ఛశాట్’ పేలోడ్ ద్వారా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అల్ట్రా-హై ఫ్రీక్వెన్సీ (యూహెచ్‌ఎఫ్) కమ్యూనికేషన్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే అంకుర పరిశ్రమ ఎన్ స్పేస్ టెక్ తెలిపింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన పోయెమ్-4 వేదిక ద్వారా ఇది ఇటీవల కక్ష్యలోకి చేరింది.