ఝార్ఖండ్‌లోని యునిరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజ్‌మెంట్, డిప్లొమా, గ్రాడ్యుయేట్, ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 95
వివరాలు:
1. మేనేజ్ మెంట్ ట్రైనీ: 13
2. గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ: 20
3. డిప్లొమా ట్రైనీ: 62
అర్హత: పోస్టులను అనుసరించి బీటెక్, డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు 28 ఏళ్లు, మిగతా పోస్టులకు 30 ఏళ్లు.
స్టైపెండ్: నెలకు మేనేజ్‌మెంట్ ట్రైనీకి రూ.40,000, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అపరేషనల్ ట్రైనీకి రూ.29,990.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 ఆగస్టు 30.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 సెప్టెంబర్ 24.
Website:https://www.ucil.gov.in/job.html