కర్ణాటకలోని ఉడుపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (యూసీఎస్‌ఎల్) శాశ్వత ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 13
వివరాలు:
1. అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 02
2. సీనియర్ మేనేజర్: 01
3. మేనేజర్: 05
4. డిప్యూటీ మేనేజర్: 05
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో డిగ్రీ (ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2026 జనవరి 27వ తేదీ నాటికి అసిస్టెంట్ జనరల్ మేనేజేర్‌కు 50 ఏళ్లు, సీనియర్ మేనేజర్, మేనేజర్‌కు 40 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 35 ఏళ్లు మించకూడదు.
జీతం: పోస్టులను అనుసరించి నెలకు రూ.50,000 - రూ.2,20,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 17.