కర్ణాటకలోని ఉడుపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (యూసీఎస్‌ఎల్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 03
వివరాలు:
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్
1. అసిస్టెంట్ మేనేజర్(ఎలక్ట్రికల్): 01
2. అసిస్టెంట్ మేనేజర్(మెకానికల్): 02
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 జులై 15వ తేదీ నాటికి 30 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.49,500 - రూ.54,540.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.400, ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 జులై 15.