భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)ని, యూరోపియన్ చెల్లింపుల వ్యవస్థ టార్గెట్ ఇన్‌స్టంట్ పేమెంట్ సెటిల్‌మెంట్ (టిప్స్)తో అనుసంధానం చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. భారత్-ఐరోపా ప్రాంతాల మధ్య నగదు బదిలీ (రెమిటెన్స్)ని సులభతరం చేసే లక్ష్యంతో, యూపీఐ-టిప్స్‌ను జత చేయాలనే ప్రతిపాదన రూపొందించినట్లు పేర్కొంది.