Published on Oct 4, 2024
Government Jobs
యూపీ జిల్లా కోర్టుల్లో గ్రూప్ సి, డి పోస్టులు
యూపీ జిల్లా కోర్టుల్లో గ్రూప్ సి, డి పోస్టులు

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఉత్తర్‌ప్రదేశ్ సివిల్ కోర్ట్ స్టాఫ్ సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ 2024-25 ద్వారా వివిధ కేటగిరీ కేడర్ పోస్టుల భర్తీకి అలహాబాద్‌ హైకోర్టు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 3,306

వివరాలు:

1. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III (హిందీ/ ఇంగ్లిష్): 583 పోస్టులు

2. జూనియర్ అసిస్టెంట్/ పెయిడ్ అప్రెంటిస్‌: 1054 పోస్టులు

3. డ్రైవర్లు (డ్రైవర్ కేటగిరీ 'సి' గ్రేడ్-IV): 30 పోస్టులు

4. ట్యూబ్ వెల్ ఆపరేటర్ కమ్-ఎలక్ట్రీషియన్/ ప్రాసెస్ సర్వర్/ ఆర్డర్లీ/ ప్యూన్/ ఆఫీస్ ప్యూన్/ ఫర్రాష్/ చౌకీదార్/ వాటర్‌మ్యాన్/ స్వీపర్/ మాలి/ కూలీ/ భిస్తీ/ లిఫ్ట్‌మ్యాన్/ స్వీపర్-కమ్-ఫర్రాష్: 1639 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి 6వ తరగతి, 10వ తరగతి, 12వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

పే స్కేల్: నెలకు రూ.5200-20200.

వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి రాత పరీక్ష, హిందీ/ ఇంగ్లిష్ కంప్యూటర్ టైప్ టెస్ట్, హిందీ/ ఇంగ్లిష్ స్టెనోగ్రఫీ టెస్ట్, టెక్నికల్ డ్రైవింగ్ టెస్ట్ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 24-10-2024.

Website:https://www.allahabadhighcourt.in/event/event_20039_01-10-2024.html