గ్రీన్‌కో గ్రూపు వ్యవస్థాపకుల నేతృత్వంలోని ఏఎం గ్రూపు, ఉత్తర్ ప్రదేశ్ గ్రేటర్ నోయిడా ప్రాంతంలో 1 గిగావాట్ సామర్థ్యంతో కర్బన రహిత, అధిక సామర్థ్యంతో కూడిన కృత్రిమమేధ (ఏఐ) కంప్యూటింగ్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అంతర్జాతీయ అవసరాలను తీర్చే విధంగా ఇది ఉంటుందని పేర్కొంది.
ఈ ప్రాజెక్టు కోసం సంస్థ దాదాపు రూ.2.25 లక్షల కోట్ల (25 బిలియన్ డాలర్ల) పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టును దశల వారీగా అభివృద్ధి చేస్తారు. మొదటి దశ 2028 నాటికి పూర్తవుతుందని, 2030లో పూర్తి స్థాయి 1 గిగావాట్ సామర్థ్యాన్ని సాధించాలని ఏఎం గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది.