Published on Sep 2, 2024
Current Affairs
యూపీఐ ‘అంతర్జాతీయ’ రికార్డు
యూపీఐ ‘అంతర్జాతీయ’ రికార్డు

భారత్‌కు చెందిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలసంఖ్య పరంగా ప్రపంచంలోని దిగ్గజ డిజిటల్‌ చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌లను వెనక్కినెట్టినట్లు పేసెక్యూర్‌ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం, 2024 ఏప్రిల్‌- జులైలో యూపీఐ ప్లాట్‌ఫామ్‌ ద్వారా రూ.81 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. ఏడాదిక్రితం ఇదే కాలంతో పోలిస్తే ఈ విలువ 37% ఎక్కువ.

* సెకనుకు యూపీఐ ద్వారా 3,729.10 లావాదేవీలు జరిగాయని ఈ నివేదిక పేర్కొంది. 2022లో ప్రతి సెకనుకు 2,348 లావాదేవీలు జరిగాయి. అంటే యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై సెకనుకు లావాదేవీల సంఖ్య 58% మేర పెరిగింది. ఈ విషయంలో చైనాకు చెందిన అలిపే, అమెరికా పేపాల్, బ్రెజిల్‌కు చెందిన పిక్స్‌ ప్లాట్‌ఫామ్‌లను యూపీఐ వెనక్కి నెట్టింది.