యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఛైర్మన్‌గా రక్షణశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ 2025, మే 14న నియమితులయ్యారు. ఇప్పటిదాకా యూపీఎస్సీ ఛైర్మన్‌గా ఉన్న ప్రీతి సూదన్ పదవీకాలం ఏప్రిల్ 29వ తేదీతో ముగిసింది. దీంతో అజయ్‌కుమార్ నియామకం జరిగింది. ఈయన 1985 బ్యాచ్, కేరళ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆగష్టు 23, 2019 నుంచి అక్టోబరు 31, 2022 వరకు రక్షణశాఖ కార్యదర్శిగా పనిచేశారు.