యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 2025 సంవత్సరానికి సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖలలోని గ్రూప్-ఏ & బీ స్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 462
వివరాలు:
1. అసిస్టెంట్ డైరెక్టర్ (బ్యాంకింగ్): 02
2. అసిస్టెంట్ డైరెక్టర్ (కార్పొరేట్ లా): 03
3. కంపెనీ ప్రాసిక్యూటర్: 25
4. డిప్యూటీ సూపరింటెండింగ్ హార్టికల్చరిస్ట్: 02
5. డిప్యూటీ ఆర్కిటెక్ట్: 16
6. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 03
7. డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ (నాన్ మెడికల్): 15
8. అసిస్టెంట్ ప్రొఫెసర్ (కార్డియాక్ అనస్థీషియా): 3
9. అసిస్టెంట్ ప్రొఫెసర్ (డెర్మటాలజీ): 04
10. స్పెషలిస్ట్ గ్రేడ్-3 (మైక్రోబయాలజీ): 11
11. అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆప్తాల్మాలజీ): 08
12. అసిస్టెంట్ ప్రొఫెసర్ (పబ్లిక్ హెల్త్): 09
13. అసిస్టెంట్ ప్రొఫెసర్ (రేడియోథెరపీ): 08
14. మెడికల్ ఫిజిసిస్ట్: 02
15. డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (టెక్నికల్): 13
16. సైంటిస్ట్-బీ (జియాలజీ): 01 మొదలైనవి..
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీ/బీఏ, బీఆర్క్, బీఎస్సీ, బీటెక్, బీఈ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీబీఎస్, డీఎన్‌బీ, సీఏ, ఎంఎస్సీ, డిప్లొమా, ఎంవీఎస్‌సీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, ఎంసీహెచ్, డీఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయో పరిమితి: పోస్టులను అనుసరించి 30 నుంచి 50 ఏళ్ల వరకు వయోపరిమితి ఉంటుంది. వయో సడలింపు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.
జీతం: 7వ సీపీసీ ప్రకారం పే మ్యాట్రిక్స్‌లో లెవెల్-07 నుంచి లెవెల్-11 వరకు ఉంటుంది. జీతాలు రూ.44,900/- నుంచి రూ. 2,08,700/- వరకు ఉంటాయి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.25. ఎస్సీ/ఎస్టీ/మహిళా/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. తగినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 2025 జులై 3.
Website: https://upsc.gov.in/recruitment/recruitment-advertisements