- సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు యునెస్కో నిర్వహిస్తున్న సదస్సు 2025, డిసెంబరు 8న దిల్లీలోని ఎర్రకోటలో ప్రారంభమైంది. ఇలాంటిది మన దేశంలో జరగడం ఇదే తొలిసారి. సదస్సులో వారసత్వ జాబితాల్లో చేర్చడానికి వచ్చిన ప్రతిపాదనల్ని అంతర్ ప్రభుత్వ కమిటీ పరిశీలిస్తుంది. గుర్తింపు పొందడానికే కాకుండా పరిరక్షణకు ఈ జాబితాలు శక్తిమంతమైన ఆయుధాలని యునెస్కో పేర్కొంది.
- దీని ముందుకు దీపావళి పండుగ సహా 67 నామినేషన్లు వచ్చాయి.