Published on Dec 10, 2025
Current Affairs
యునెస్కో వారసత్వ గుర్తింపు
యునెస్కో వారసత్వ గుర్తింపు

బంగ్లాదేశ్‌కు చెందిన తంగైల్‌ చీర నేత కళతోపాటు అఫ్గాన్‌కు చెందిన మినియేచర్‌ పెయింటింగ్‌లోని బేజాద్‌ శైలికి యునెస్కో వారసత్వ గుర్తింపు లభించింది. వీటితోపాటు బిష్త్‌ (పురుషుల గౌను) తయారీ, నైపుణ్యానికి, పాకిస్థాన్‌లో అంతరిస్తున్న పురాతన జానపద సంగీత పరికరం బోరీండో, దాంతో ఆలపించే జానపద గీతాలు, పరాగ్వేకు చెందిన పురాతన సిరామిక్‌ పనితనం, కెన్యాలోని దైదా కమ్యూనిటీకి చెందిన మ్వాజిందికా ఆధ్యాత్మిక నృత్యం.. అంతర్జాతీయ గుర్తింపును దక్కిôచుకున్నాయి. ఇంకా వియత్నాంకు చెందిన డాంగ్‌ హో జానపద చెక్కబ్లాకుల ప్రింటింగ్‌ నైపుణ్యం.. తయారీ, ఫిలిప్పీన్స్‌లోని బొహోల్‌ ద్వీపానికి చెందిన సముద్రపు ఉప్పుతో తయారుచేసే ఆసిన్‌ టిబోక్‌ తయారీ విధానం, పనామాలోని క్వించా ఇంటి నిర్మాణం, జుంటా డి ఎంబారా, పోర్చుగల్‌లోని మోలిసీరో బోటు కార్పెంటరీ కళ, ఉజ్బెకిస్థాన్‌లోని కోబిజ్‌ కళ, ఆడే విధానం ఈ జాబితాలో చోటు సంపాదించాయి. వీటిని రక్షించుకోవాల్సి ఉందని దిల్లీలోని ఎర్రకోటలో జరుతుతోన్న యునెస్కో 20వ సదస్సులో ప్రతినిధులు స్పష్టం చేశారు.