ప్రపంచంలో 60 శాతం దేశాల్లో మాత్రమే పాఠశాలల్లో అందించే ఆహారం, పానీయాలను నియంత్రించే, పర్యవేక్షించే చట్టాలు ఉన్నాయని యునెస్కో నివేదిక వెల్లడించింది.
గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక రూపకల్పనలో లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ తదితర సంస్థలు పాలుపంచుకున్నాయి.
ఈ అధ్యయనం ప్రకారం.. 187 దేశాల్లో 93 దేశాల్లోనే పాఠశాలల్లో ఏ ఆహారాన్ని లేదా పానీయాన్ని అనుమతించాలనే నిబంధనలు ఉన్నాయి. ఈ 93 దేశాల్లో 29 శాతం దేశాలు మాత్రమే పాఠశాలల్లో ఆహార పదార్థాల మార్కెటింగ్‌ను నియంత్రిస్తున్నాయి.
30 అల్ప, మధ్యాదాయ దేశాల్లో పౌష్టికాహార విద్యను ప్రాజెక్టులు, ఇతర మార్గాల్లోనే బోధిస్తున్నారని.. ప్రధాన సబ్జెక్టుగా కరిక్యులంలో పెట్టడం లేదని అధ్యయనకర్తలు పేర్కొన్నారు.