Published on Mar 3, 2025
Current Affairs
యునెస్కో నివేదిక
యునెస్కో నివేదిక

ప్రపంచంలో 40 శాతం మందికి మాతృభాషలో లేదా అర్థం చేసుకునే భాషలో విద్య అందడం లేదని యునెస్కో గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌ (జీఈఎం) బృందం వెల్లడించింది.

బాలల వికాసంలో మాతృభాష ప్రభావాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తున్నా విధానాల రూపకల్పనలో వెనుకబడ్డాయని అభిప్రాయపడింది.

స్థానిక భాషల్లో ఉపాధ్యాయుల కొరత, మెటీరియల్‌ లేకపోవడం, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత మొదలైనవి ఈ పరిస్థితికి కారణాలని పేర్కొంది.

25వ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ‘లాంగ్వేజెస్‌ మ్యాటర్స్‌: గ్లోబల్‌ గైడెన్స్‌ ఆన్‌ మల్టీలింగువల్‌ ఎడ్యుకేషన్‌’ పేరుతో జీఈఎం ఈ నివేదికను విడుదల చేసింది.