‘ఐక్యరాజ్యసమితి విద్య వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ’ (యునెస్కో) నుంచి తాను మరోసారి వైదొలగుతున్నట్లు అమెరికా ప్రకటించింది.
సంస్థ ప్రదర్శిస్తున్న ఇజ్రాయెల్ వ్యతిరేకత కారణంగానే.. చేరిన రెండేళ్లకే వైదొలగుతున్నామని స్పష్టంచేసింది.
పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న యునెస్కో నుంచి అమెరికా వైదొలగడం ఇది మూడోసారి.