Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.

Published on Nov 14, 2024
Government Jobs
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

తెలంగాణ, హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్‌) డైరెక్ట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 42

వివ‌రాలు:

1. ప్రొఫెసర్: 20

2. అసోసియేట్ ప్రొఫెసర్‌: 21

3. అసిస్టెంట్ ప్రొఫెసర్‌: 01

విభాగాలు: సైన్స్‌, హ్యుమానిటీస్, ఎకనామిక్స్‌, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్‌, మేనేజ్‌మెంట్ స్టడీస్.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో జనరల్‌ డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, కంప్యూటర్‌ పరిజ్ఞానం, నెట్/ స్లెట్‌/ సెట్ ఉత్తీర్ణత ఉండాలి.

వయో పరిమితి: 65 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, పని అనుభవం, సెమినార్, గ్రూప్‌ డిస్కషన్, డెమోన్‌స్ట్రేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా/ఆఫ్‌లైన్ ద్వారా

ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ ది అసిస్టెంట్ రిజిస్ట్రార్, రిక్రూట్‌మెంట్ సెల్, రూమ్ నంబర్‌: 221, మొదటి అంతస్తు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, ప్రొఫెసర్, సి.ఆర్‌. రావు రోడ్, సెంట్రల్ యూనివర్సిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్’ చిరునామాకు పంపించాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09-12-2024.

ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16-12-2024.

Website:https://uohyd.ac.in/

Apply online:https://curec.samarth.ac.in/index.php/search/site/index