యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్) 2025-26 విద్యా సంవత్సరానికి 41 పీజీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
ఎంఎస్సీ, ఎంపీఏ, ఎంఎఫ్‌ఏ/ ఎంవీఏ, ఎంబీఏ, ఎంటెక్.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీయూఈటీ (పీజీ)-2025, గేట్-2025 స్కోరు సాధించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ సీయూఈటీ (పీజీ)-2025 స్కోర్, గేట్ స్కోర్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్ రూ.300; ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ-ఎన్‌సీఎల్ రూ.200; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.125.
ఇంటర్వ్యూతో కూడిన పీజీ ప్రోగ్రామ్ అడ్మిషన్ షెడ్యూల్:
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 09-06-2025.
ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 18-06-2025.
ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 24, 25, 26.
మెరిట్ జాబితా వెల్లడి: 04-07-2025.
అడ్మిషన్ కౌన్సెలింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ: 16-07-2025.
తరగతుల ప్రారంభం: 17-08-2025.
ఇంటర్వ్యూ లేని పీజీ ప్రోగ్రామ్ అడ్మిషన్ షెడ్యూల్:
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09-09-2025.
మెరిట్ జాబితా వెల్లడి: 30-06-2025.
అడ్మిషన్ కౌన్సెలింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ: జులై 14, 15.
తరగతుల ప్రారంభం: 16-07-2025.
ఎంటెక్ ప్రోగ్రామ్ షెడ్యూల్ తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 30.07.2025.
మెరిట్ జాబితా వెల్లడి: 07-07-2025.
అడ్మిషన్ కౌన్సెలింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ: జులై 16.
తరగతుల ప్రారంభం: 17-07-2025.
Website: http://acad.uohyd.ac.in/
Apply online: http://acad.uohyd.ac.in/CUETPG25.html