యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 111
వివరాలు:
1. సిస్టం అనలిస్ట్: 01
2. డిప్యూటీ కంట్రోలర్: 18
3. అసిస్టెంట్ ఇంజినీర్: 01
4. అసిస్టెంట్ ఇంజినీర్(నావల్ క్వాలిటీ అస్యూరెన్స్ ఎలక్ట్రికల్): 07
5. అసిస్టెంట్ ఇంజినీర్(నావల్ క్వాలిటీ అస్యూరెన్స్ మెకానికల్): 01
6. జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్: 13
7. అసిస్టెంట్ లెజిస్లేటివ్ కౌన్సిల్(హిందీ బ్రాంచ్): 04
8. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్: 66
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, డిగ్రీ(కెమికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్), బీటెక్ లేదా బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎల్ఎల్‌బీలో ఉత్తీర్ణతతో పాటు, పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 30 - 40 ఏళ్లు, అసిస్టెంట్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు 40 - 45 ఏళ్లు, జాయింట్ అసిస్టెంట్
డైరెక్టర్‌కు 30 - 35 ఏళ్లు, అసిస్టెంట్ ఇంజినీర్(మెకానికల్)కు 30 ఏళ్లు, అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్)కు 30 - 35 ఏళ్లు, అసిస్టెంట్ ఇంజినీర్(కెమికల్)కు 30 ఏళ్లు, డిప్యూటీ కంట్రోలర్‌కు 35 - 45 ఏళ్లు, సిస్టం అనలిస్ట్‌కు 35
ఏళ్లు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 1.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
Website: https://upsc.gov.in/recruitment/recruitment-advertisements