తమిళనాడు రాష్ట్ర పురావస్తు శాఖ ప్రచురించిన ‘యాంటిక్విటీ ఆఫ్ ఐరన్’ పుస్తకాన్ని 2025, జనవరి 23న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ విడుదల చేశారు.
ఇనుప యుగం తొలుత తమిళనేలపైనే ప్రారంభమైందని, 5,300 ఏళ్ల క్రితమే ఇక్కడ ఆ లోహాన్ని ఉపయోగించినట్ల్లు శాస్త్రీయంగా నిరూపితమైందని ఆయన తెలిపారు.
దీన్నిబట్టి క్రీ.పూ. 4,000 నాటికి ఈ ప్రాంతంలో ఇనుప యుగం ఉందని వ్యాఖ్యానించారు.