Published on Nov 21, 2024
Government Jobs
యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబరు 2024
యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబరు 2024

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 (యూజీసీ నెట్‌) పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైంది. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ అవార్డు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఈ పరీక్ష రాస్తారు. దీన్ని ఏటా రెండు సార్లు జూన్‌, డిసెంబరు నెలల్లో నిర్వహిస్తారు.

వివరాలు:

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ (యూజీసీ నెట్‌) 2024

సబ్జెక్టులు: అడల్ట్‌ ఎడ్యుకేషన్‌, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్‌ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్‌, కంప్యూటర్ సైన్స్ అండ్‌, క్రిమినాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్‌, ఇంగ్లిష్‌, హోం సైన్స్‌, హిస్టరీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఇండియన్‌ కల్చర్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, లింగ్విస్టిక్స్‌, మ్యూజిక్‌, సైకాలజీ, లా, ఫిలాసఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు తదితరాలు.

మొత్తం సబ్జెక్టుల సంఖ్య: 85.

అర్హత: కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఓబీసీ- ఎన్‌సీఎల్‌/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులకు 50% మార్కులు అవసరం.

వయోపరిమితి: జేఆర్‌ఎఫ్‌కు 01.01.2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయోపరిమితి లేదు.

పరీక్ష విధానం: పరీక్ష కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలు... 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలు... 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది. పేపర్‌-1లో రీజనింగ్‌ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైరెర్జంట్‌ థింకింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌పై ప్రశ్నలు వస్తాయి. పేపర్-2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. లాంగ్వేజెస్‌ మినహా ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీలో ఉంటుంది.

ఉత్తీర్ణత మార్కులు: అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ వారు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ వారు కనీసం 35 శాతం మార్కులను స్కోర్ చేయాలి.

దరఖాస్తు రుసుము: జనరల్/ అన్‌రిజర్వ్‌డ్‌కు రూ.1150; జనరల్- ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ- ఎన్‌సీఎల్‌ రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్‌కు రూ.325.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-12-2024.

పరీక్ష రుసుం చెల్లింపు చివరి తేదీ: 11-12-2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 12, 13-12-2024.

పరీక్ష కేంద్రాల వివరాల వెల్లడి: తర్వాత వెల్లడించనున్నారు.

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ప్రారంభం: తర్వాత వెల్లడించనున్నారు.

పరీక్ష తేదీలు: 01-01-2025 నుంచి 19-01-2025 వరకు.

ఫలితాల వెల్లడి: తర్వాత వెల్లడించనున్నారు.

Website:https://ugcnet.nta.ac.in/

Apply online:https://ugcnetdec2024.ntaonline.in/site/login