Published on Sep 3, 2024
Current Affairs
యోగేశ్‌కు మరో రజతం
యోగేశ్‌కు మరో రజతం

డిస్కస్‌ త్రోలో వరుసగా రెండో పారాలింపిక్స్‌లోనూ యోగేశ్‌ కతూనియా రజతం గెలిచాడు. 2024, సెప్టెంబరు 2న జరిగిన ఎఫ్‌-56 విభాగంలో యోగేశ్‌ 42.22 మీటర్ల దూరం డిస్కస్‌ను విసిరాడు. బ్రెజిల్‌ క్రీడాకారుడు బటిస్తా శాంటోస్‌ 46.86 మీటర్లతో క్రీడల రికార్డు నెలకొల్పుతూ పారాలింపిక్స్‌లో హ్యాట్రిక్‌ స్వర్ణం సాధించాడు. గ్రీస్‌ అథ్లెట్‌ 41.32 మీటర్లతో కాంస్యం నెగ్గాడు.