హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్ అభివృద్ధి చేసిన ‘యాక్టివ్లీ కూల్డ్ స్క్రామ్‌జెట్ ఫుల్ స్కేల్ కంబస్టర్’ను డీఆర్‌డీఓ 2026, జనవరి 9న విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో హైపర్‌సోనిక్ క్షిపణులను అభివృద్ధి చేసే దిశలో ఇది కీలక ముందడుగు. కంచన్‌బాగ్ మిస్సైల్ క్లాంప్లెక్స్ ప్రయోగశాలలోని అత్యాధునిక స్క్రామ్‌జెట్ కనెక్ట్ పైప్ టెస్ట్(ఎస్‌సీపీటీ) ఫెసిలిటీలో ఈ గ్రౌండ్ టెస్ట్‌ను నిర్వహించారు. ఇంజిన్ కంబస్టర్‌ను ఏకధాటిగా 12 నిమిషాలకు పైగా పనిచేయించి దాని సామర్థ్యాన్ని పరీక్షించారు.
ధ్వని కంటే ఐదు రెట్లు ఎక్కువ వేగంతో.. గంటకు సుమారు 6100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే సామర్థ్యం హైపర్‌సోనిక్ క్షిపణుల సొంతం.