Published on Mar 3, 2025
Current Affairs
యుకికి డబుల్స్‌ టైటిల్‌
యుకికి డబుల్స్‌ టైటిల్‌

భారత టెన్నిస్‌ స్టార్‌ యుకి భాంబ్రి కెరీర్‌లో తొలి ఏటీపీ 500 టైటిల్‌ సాధించాడు. దుబాయ్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో అలెక్సీ  పాపిరిన్‌ (ఆస్ట్రేలియా)తో కలిసి అతడు డబుల్స్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు.

2025, మార్చి 2న జరిగిన జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో యుకి- అలెక్సీ జోడీ 3-6, 7-6, 10-8తో హ్యారీ హెలియోవారా (ఫిన్లాండ్‌)- హెన్రీ ప్యాటెన్‌ (ఇంగ్లాండ్‌) జంటపై విజయం సాధించింది.